
వాయిస్ టుడే:ఇబ్రహీంపట్నం ప్రతినిధి అక్టోబర్ :31
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ల సమావేశం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగినది.ఈ సందర్భంగా కార్యకర్తల ఉద్దేశించి కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపిస్తామని అన్నారు. నియోజకవర్గంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ పై నమ్మకం ఉందని ఆరాచక పాలన నుండి విముక్తి కోరుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని కెసిఆర్ ను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వస్తుందని అన్నారు. మన మీటింగ్ స్టార్ట్ అవ్వగానే విద్యుత్ అధికారులు విద్యుత్ తొలగించడంపై ఏంటి అని ప్రశ్నించారు ఇది బిఆర్ఎస్ పార్టీలో ఓటమి భయంతో మీటింగ్లకు కరెంటు నిలిపివేయడం జరిగిందని మీరు అడ్డంకులు ఎన్ని పెట్టిన కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. మోసపూరిత మాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇంకెన్నాళ్లు అంధకారంలో ఉంచుతారు. గల్ఫ్ బాధితులకు ఎలాంటి సహాయం అందించపోగా మీరు గల్ఫ్ దేశాల నుండి తిరిగి రండి మీకు ఉద్యోగం ఇస్తామని బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు చదువుతున్న విద్యార్థులకే ఉద్యోగాలు ఇవ్వలేని మీ ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఎలా ఆదుకుంటుంది. గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన వారు కోరుట్ల నియోజకవర్గం లో ప్రతి గ్రామానికి ఒక 50 మంది బాధితులు ఉన


