కన్నుల పండువ గా జ్వాల తోరణం
Jwala thoranam is feast for the eyes
శ్రీకాళహస్తి డిసెంబర్ 13
శివయ్యకు అగ్నితో అభిషేకం
చొక్కాణి చెట్టును కాల్చుతున్న దృశ్యం
శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో కన్నుల పండువ గా జ్వాలా తోరణం కార్యక్రమాలను నిర్వహించారు ప్రతి ఏడాది ఆలయంలో చొక్కాణి ఉత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ ఈ నేపథ్యంలో ఈ ఏడాది చొక్కాణి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొన్ని తమిళ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.తిరుణ్ణవ మలైలో పౌర్ణమి సందర్భంగా అగ్నితో అభిషేకించటం ఆనవాయితీ ఈ ఆనవాయితీని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూడా తరాల నుంచి నిర్వహిస్తున్నారు
బాల దీపాల ఊరేగింపు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాణి సందర్భంగా ఆలయంలోని అమ్మవారి గర్భగుడి వద్ద గురువారం రాత్రి వెలిగించిన బాల దీపాలను అర్చకులు నాట్యాలు చేస్తూ నంది విగ్రహం వద్దకు తెచ్చారు సంప్రదాయ బద్ధంగా వేద పండితులు వేదమంత్రాలను పటిస్తుండగా అర్చకులు ఆలయం పురోహితులు సారథ్యంలో చొక్కాణి చెట్టును తగులు బెట్టారు. శివయ్యను అగ్నితో పూజించే విధానాల్లోఇదొకటి
అయితే చొక్కాణి ఉత్సవానికి స్థానిక భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు