- Advertisement -
ఎంపీ రవిచంద్రతో కేఏ పాల్ భేటీ
హైదరాబాద్, జనవరి, 21:
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తో.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎంపీ రవిచంద్ర నివాసానికి విచ్చేసిన కేఏ పాల్.. ఆయనతో సుమారు గంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కాపుల స్ధితిగతులు.. రాజకీయ చైతన్యం.. కాపుల ఓటు బ్యాంకు.. ఐక్యత.. రాబోయే ఏపీ ఎన్నికల్లో కాపులు తీసుకోవాల్సిన నిర్ణయాధికారం తదితర అంశాలు వీరి మధ్య చర్చ కు వచ్చాయి.
- Advertisement -