లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేసిన కాకతీయ యూనివర్సిటీ లంబాడి విద్యార్థులు

- Advertisement -

లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేసిన కాకతీయ యూనివర్సిటీ లంబాడి విద్యార్థులు

Kakatiya University Lambadi students make Lambadi self-respect rally a success

రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీలు కాదని తెల్లం వెంకట్రావు మరియు సోయం బాపూరావు చేస్తున్నటువంటి ఆరోపణల పైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీని నిర్వహించరు . ఈ ర్యాలీలో కాకతీయ యూనివర్సిటీ గిరిజన నాయకుడు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో లంబాడి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవం చేశారు .

ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో తమ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఆదివాసీ నాయకులు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నాడు. తెలంగాణలో లంబాడీలను రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని కొందరు కావాలని రాజకీయ పబ్బం గడపడానికే సోదరులైన ఆదివాసులకు గిరిజనులకు మధ్య చిచ్చు పెడుతున్నారని ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానివేసి సరైన అవగాహనతో మాట్లాడాలని లేనిపక్షంలో తెల్ల వెంకటరావు మరియు సోయం బాపూరావు మీద దాడి తప్పదని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ లంబాడి విద్యార్థులు నాయకులు సూర్య నాయక్, యాదగిరి నాయక్, బానోత్ బాలాజీ నాయక్,బానోత్ ప్రసాద్,మాలోత్ రాంబాబు,భూక్య సంతోష్, ప్రవీణ్, సందీప్,సునీల్, చరణ్, ఆలోజీ,నవ్య ధరవత్, జానకి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular