కల్వకుంట్ల కన్నారావుకు మరో షాక్ తగిలింది. బంజారా హిల్స్ కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు అయింది.
గెస్ట్ హౌస్‌లో ఒక్కరినీ నిర్బంధించి, కొట్టి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసిన కేసులో కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు అయిందని సమాచారం. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి అరాచకం చేశారని వార్తలు వస్తున్నాయి.అయితే… న్యాయం కోసం కన్నరావు వద్దకు సాప్ట్ వేర్ ఉద్యోగి విజయ వర్ధన్ రావు వెళ్లారట. అదే సమయంలో… సాప్ట్ వేర్ ఉద్యోగి విజయ వర్ధన్ రావు వద్ద నగలు..నగదు ఉన్నాయని తెల్సుకుని స్కెచ్ వేసిందట నందిని. అయితే… కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి పక్కా ప్లాన్ చేశారట నందిని. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసిపి కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారట. అయితే.. ఆ బాధితుడి ఫిర్యాదుతో కన్నా రావుతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశాట బంజారాహిల్స్ పోలీసులు.