కల్యాణ లక్ష్మీ & షాద్ ముబారక్ చెక్కులు అందచేత
Kalyana Lakshmi & Shad Mubarak cheques issued
235 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల అరవై రూపాయల చెక్కులు
కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కుల పంపిణీ.
రామగుండం ఎమ్మెల్యే.
రామగుండం :
రామగుండం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులు అయినటువంటి 235 మంది లబ్ధిదారులకు 2,35,27,260 ( రెండు కోట్ల ముప్ఫై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల అరవై) రూపాయల విలువగల కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో
చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ
మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు
మహిళా సాధికారితనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.
కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు.ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయ డానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా పథకాలతో రైతన్నలను ఆదుకుంటుందన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇటు కార్పొరేషన్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది,
అటు పల్లెల్లో రైతు సోదరలకు అండగా ఉండడానికి పూర్తి భరోసాను కలిపియ్యడం జరుగుతుంది
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీ లు
ఇచ్చిన మాట ప్రకారంగా 11 నెలలు గడవక ముందే సాధ్యమైన అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రజల మద్దతు పొందుతున్న ప్రజా పాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
6 గ్యారెంటీ లలో*ల్
చేయూత తెలంగాణ ప్రజలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 10 లక్షల వరకు రాజివ్ ఆరోగ్య శ్రీ భీమా కలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది
గృహ జ్యోతి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్క ఇల్లు కూడా విద్యుత్ సరఫరా లేకుండా ఉండకూడదు అని 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి ఉచితంగా విద్యుత్ అందజేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహాలక్ష్మి తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ప్రతీ అక్క- చెల్లమ్మ లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న, ఉచితంగా బస్ సౌకర్యం కల్పించినది మీకు కనిపించడం లేదా
యువ వికాసం: యువ వికాసం పథకం ద్వారా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ 4 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ప్రపంచంతో పోటీ పడుతూ అన్ని సౌకర్యాలతో నిర్మించడానికి శంకుస్థాపన చేస్తున్నాం అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, ప్రజా పాలన
రైతు భరోసా ఎద్దు ఏడ్చిన ఎవసం, రైతు ఏడ్చినా రాజ్యం, చరిత్రలో బాగుపడింది లేదు అందుకే రాష్ట్రం లో ఏ ఒక్క రైతు కట్లో కన్నీరు ఉండకూడదు అని దృఢ సంకల్పం తో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో తనకు సాధ్యం కాని లక్ష రుణమాఫీ ని 9 నెలల కాలంలోనే 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తున్న రైతు బంధవుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంట కాలం నుండి వరి పంటకు 500 బోనస్ ఇవ్వడానికి అధికారులకు అన్ని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్లు 20 నవంబర్ నుండీ ఇల్లు లేని ప్రతి నీరు- పేద కుటుంబాలకు 5 లక్షల వరకు ఇచ్చి వారికి నీడ కల్పించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం
ఇవన్నీ యేడాది పాలన గడవకముందే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు