Sunday, September 8, 2024

 తెలంగాణలో కమలం దూకుడు….

- Advertisement -

 తెలంగాణలో కమలం దూకుడు….
నిజామాబాద్, ఫిబ్రవరి 22
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్ తో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తం 17 ఎంపీ సీట్లలో సగానికిపైగా సగం సీట్లు దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అయితే 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప్ యాత్రతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే  లోక్ సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ యాత్రను నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఒకేసారి జెండా ఊపి ప్రారంభించారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ బిజెపి పార్లమెంటు బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ తో కలిసి బాసర ఆలయం వద్ద కొమరం భీమ్ క్లస్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 24న హైదరాబాద్ లో జరిగే విజయ్ సంకల్ప్ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. మార్చి 1న యాత్ర ముగుస్తుందని సుభాష్ తెలిపారు. తొలి దశ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే తేదీ, స్థలం ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు.కాగా పార్టీ విజయ సంకల్ప యాత్రకు ముందు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేతులు కలిపాయని, 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంలో బీఆర్ఎస్ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు.2జీ, బొగ్గు కుంభకోణాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది. రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపులని ఆయన అన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తాండూరులోని రాజ రాజేశ్వరి క్లస్టర్ నుంచి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. గత పదేళ్లుగా మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, దేశం ఐక్యంగా, శాంతియుతంగా, సుభిక్షంగా ఉండేలా చూశారన్నారు.అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. అయితే ఈ క్రమంలో పార్టీ కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ లాంటి నేతలు అన్యూహంగా ఓటమి పాలయ్యారు. వీరితోపాటు మరికొంతమంది నేతలు ఓటమిని చవి చూశారు. అయితే వీళ్లంతా లోక్ సభ బరిలో నిలిచేందుకు పావులు కదుపుతుండటం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్