Wednesday, March 25, 2026

తమిళనాడు ఎన్నికల బరిలో వుండం కమల్ హాసన్

- Advertisement -

తమిళనాడు ఎన్నికల బరిలో వుండం
కమల్ హాసన్
చెన్నై

Kamal Haasan: Contesting in the Tamil Nadu Elections
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. చెన్నైలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో నిన్న భేటీ అయిన అనంతరం కమల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
సీట్ల పంపకాల చర్చల్లో డీఎంకే ప్రతిపాదించిన సీట్ల సంఖ్య తమకు ఆమోదయోగ్యం కాదని కమల్ తెలిపారు. అలాగే, తమ అభ్యర్థులను డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న సూచనను కూడా అంగీకరించలేకపోయామని ఆయన వివరించారు. తమ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తు కేవలం ఒక చిహ్నం కాదని, అది తమ గుర్తింపు అని కమల్ పేర్కొన్నారు. మతతత్వ శక్తులు రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో, మా నిర్ణయం త్యాగం కాదు, కర్తవ్యం. ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడమే మా లక్ష్యం అని కమల్ హాసన్ అన్నారు.
మరోవైపు, కమల్ నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ స్వాగతించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమల్ గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని, చరిత్ర దీన్ని ప్రశంసిస్తుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్