లింగోజిగూడ పాత గ్రామంలో ఇంటింటి ప్రచారం
ఎల్బీనగర్, వాయిస్ టుడే:ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని లింగోజిగూడ పాత గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఘనత దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి సుధీర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.