Friday, June 20, 2025

కమలానికి కొత్త సారధి..

- Advertisement -

కమలానికి కొత్త సారధి..
హైదరాబాద్, జూన్ 11
కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన మంత్రి వర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలకు స్థానం కల్పించారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరన్నది అసలు టాపిక్. ఇక అన్నింటికంటే ముందుగా తెలంగాణ విషయానికొద్దాం.కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. ఆయన చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. తాజాగా మోదీ 3.0 కేబినెట్‌లోకి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను తీసుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపైనే ఇప్పుడు నేతలంతా చర్చించుకుంటున్నారు.సామాన్య కార్యకర్తకు సైతం పెద్ద పదవులు అందుకునే అవకాశం ఒక్క బీజేపీలో ఉందని నేతలు బహిరంగ సభలో తెగ ఊదరగొడతారు. ఆ మాదిరిగానే పార్టీలోని కార్యకర్త స్థాయి వ్యక్తికి తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తారా? లేక పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇస్తారా? ఇదే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలను వెంటాడుతున్నాయిఇప్పటికే తెలంగాణ బీజేపీలో దాదాపు మూడు వర్గాలు ఉన్నాయన్నది అంతర్గత సమాచారం. ఈ విషయంలో నేతలు నోరుజారిన పలు సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు ఆ వర్గాలకు చెందిన వ్యక్తులకు కాకుండా కొత్త వ్యక్తికి ఇవ్వాలని ఆలోచన చేస్తోందట ఢిల్లీ బీజేపీ. ఇప్పటికే డీకె అరుణ, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమకే ఆ పదవి వస్తుందని ఆయా నేతల మద్దతు దారులు బయటకు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికల లేకపోవడంతో పార్టీని అంటిపెట్టుకున్న నేతకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మళ్లీ సీనియర్లకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందన్నది ఢిల్లీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. త్వరలోనే దీనిపై బీజేపీ నుంచి స్పష్టత రావడం ఖాయమన్నమాట.
ప్రముఖంగా వినిపిస్తున్న ఈటెల
: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించిది. మోడీ క్యాబినెట్‌లో వరుసగా రెండోసారి చోటు లభించింది. ఇప్పటి వరకు రెండు పదవులు నిర్వహిస్తు వస్తున్న కిషన్ రెడ్డి ఇకపై ఒకటే పదవిలో కొనసాగనున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథి ఎవరూ అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ బాగానే ఓట్లు, సీట్లు రాబట్టుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు సాధించింది. 17 సీట్లు తెలంగాణలో ఉంటే అందులో ఎనిమిదింటిని బీజేపీ గెలుకుంది. అందుకే సంస్థాగతంగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలమనే ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చేపట్టబోయే మార్పులు ఆ దిశగానే ఉంటాయని అంటున్నారు. తెలంగాణలో సగం ఎంపీ స్థానాలు కైవశం చేసుకొని జోష్‌ మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే మల్కాజ్‌గిరి ఎంపీ అయిన ఈటల రాజేందర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన కచ్చితంగా కేంద్రమంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఉన్న సమీకరణాలతో అది సాధ్య పడలేదు. అందుకే ఆయన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదంతో వెళ్లిన బీజేపీ మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. అయితే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రజల ఆశీర్వాదం పొందింది. దీంతో అప్పట్లో ప్రచారం చేసినట్టుగానే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీంతోపాటు కమిట్మెంట్‌తో ఉన్న నేతలకు గుర్తింపు ఉంటుందని కూడా రెండు మంత్రిపదవులు ఇచ్చి చెప్పకనే చెప్పారు. మిగతా నేతలకి కూడా కీలకమైన పదవులు ఇచ్చి మరింత మందిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం పూర్తైన వెంటనే వివిధ రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ పాత్ర మరింత దూకుడుగా ఉంటుందని అంటున్నారు. అలాంటి నేతలకే పగ్గాలు అప్పగించనున్నారని టాక్ నడుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్