Saturday, March 29, 2025

కానరాని జాగ వాన

- Advertisement -

కానరాని జాగ వాన
హైదరాబాద్, జూలై 15,

Kanarani Jaga Vana

నైరుతి రుతుపవనాలు ముందుస్తుగా వచ్చినా.. భారీ వర్షాల జాడేలేదు. వరినార్లకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం సీజ్‌ ముగుస్తున్నా వాన జాడేలేదంటూ తెలంగాణలో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయన్న ఆనందం రైతన్నకు లేకుండా పోయింది. వర్షాలు లేక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్‌ కాలం కరిగి పోతున్నా.. వరుణుడు కరుణించడం లేదు. వర్షాలు లేకపోవడంతో బోర్లకు నీళ్లురాక, బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. నారుమళ్లు, ఆరుతడి పంటలు ఇప్పటికే ఎండిపోతున్నాయి. నారుమళ్లు కాపాడుకునేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీళ్లు కొని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులే కాకుండా ట్యాంకర్లకు ఎక్స్‌ట్రాగా ఖర్చుచేస్తున్నామని చెబుతున్నారు. ఆరుద్ర దాక వేచి చూస్తాం.. ఆ తర్వాత దేవుడే కాపాడాలంటున్నారు రైతులు. చెరువులకు నీళ్లు తరలించి రైతన్నలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.భారీ వర్షాలు లేకపోవడంతో రాష్ట్ర వ్యా్ప్తంగా రైతులు డైలమాలో పడ్డారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతన్నలు పొలాలను బీడుభూముల కింద వదిలేశారు. వర్షాలు కురుస్తాయని ముందస్తుగా నార్లు వేసిన రైతులు.. అది ముదిరిపోతున్నా.. ఇప్పటికీ వాన జాడలేక ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు‌ ఉంటాయని అధికారులు చెప్పడంతో ముందస్తుగా భారీ ఎత్తున వరి నార్లు పోసిపెట్టుకున్నామని.. నారు టైంలోపు నాటు వేయకుంటే పంట దిగుబడి‌పై‌ ప్రభావం చూపుతుందంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయకట్టు‌ ప్రాంతంలోని పొలాలు కూడా దున్నలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు‌ లేకపోవడంతో ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడులు వృధాగా పోతాయంటూ ఆవేదన చెందుతున్నారు రైతులు.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కర్నూలు జిల్లాలో వర్షాలు కూరవాలని గ్రామంలో ఉన్న నాగదేవతలకు నీటితో అభిషేకాలు చేస్తున్నారు. వర్షం కోసం మొక్కని దేవుడు లేడు. చేయని పూజలు లేవు.. పలకని మంత్రం లేదని నిరుత్సాహాన్ని వ్యక్తబరుస్తున్నారు. భూమి దున్ని విత్తునాటినా వర్షాలు రాకపోవడంతో వానదేవుడి కరుణ కోసం ప్రజలు వివిధ రకాల్లో పూజలు చేస్తున్నారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా సరైన సమయానికి వర్షాలు కురవక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, పురాతన ఆచారాలను నమ్ముకుని ప్రత్యేక పూజలు చేస్తున్నామంటున్నారు గ్రామస్తులు. ఇలా తెలుగురాష్ట్రాల్లో వరుణుడి ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతోందని చెప్పవచ్చు. రుతుపవనాలు దేశ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నప్పటికీ అటు ఏపీ, తెలంగాణలో అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్