Sunday, September 8, 2024

ఇందిరా పాత్ర లో కంగనా…

- Advertisement -

ముంబై, నవంబర్ 28, : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాలో ఆమె దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్ర లో కనిపించబోతున్నారు. కంగన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం పోస్టు ప్రొక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ మూవీ  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.కంగనా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలో, ఆమె మాజీ ప్రధాని ఇందిరాతో కూర్చున్నట్లుగా ఉంది. వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కంగనా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. లేటెస్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో ఈ ఫోటో తీసినట్లు తెలిపారు. “ఐజీ(ఇందిరా గాంధీ)తో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అంటూ కంగనా ఈ ఫోటోను షేర్ చేశారు. కంగనా తాజా చిత్రంలో  ఇందిరా గాంధీ పాత్రకు చిత్రబృందం ఐజీ అని పేరు పెట్టింది. అటు ప్రధాని మోదీతో కూర్చొని చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను కూడా కంగనా షేర్ చేశారు. ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ ఫోటోలను తీసినట్లు ఆమె తెలిపారు.  దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు సంబంధించిన వివరాలతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తాజాగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనికి  ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ అని పేరు పెట్టింది. ఇందులో సదరు ప్రధానులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచారు. తాజాగా ఈ కేంద్రాన్ని కంగనా సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరుతో  పేరిట ఏర్పాటు చేసిన  లైట్‌ అండ్ సౌండ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. “పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా చూపించారు. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందవచ్చు” అని కంగనా ఈ షో గురించి వెల్లడించారు.   కంగనా రనౌత్‌  స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా రూపొందుతోంది. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.   మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టితో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో దివంగత నటుడు సతీష్ కౌశిక్, అనుపమ కేర్, శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్