భారీ విజయంతో కంగనా
సిమ్లా, జూన్ 4
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓట్ల లెక్కింపులో ముందజలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ తాజా గణాంకాల ప్రకారం.. 70వేల ఓట్లతో కంగనా భారీ ఆధిక్యం సాధించారు. దాంతో 37 ఏళ్ల బాలీవుడ్ స్టార్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు.ఈ సందర్భంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మీరే బ్యాగ్‌లు సర్దుకుని బయలుదేరాలని విక్రమాదిత్యను ఆమె ఎద్దేవా చేశారు. మొదటినుంచే బాలీవుడ్ క్వీన్ తన విజయంపై ధీమాగా ఉన్నారు. ఇప్పుడు అన్నట్టుగానే ఈ ఎన్నికల్లో తన విజయాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నారు.ఎన్నికల ప్రచారం సమయంలో ప్రత్యర్థి విక్రమాధిత్య కంగానాను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత మండిని వదిలిపెట్టి ముంబైకి బ్యాగ్ సర్దుకునిఆమె బయల్దేరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా వ్యతిరేకించారు. “ఒక మహిళ గురించి ఇంత తక్కువ మాట్లాడటం వల్ల కలిగే పరిణామాలను వారు చవిచూడాల్సి వస్తుంది. ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంతో ఈరోజు స్పష్టమవుతోంది. కూతుళ్లకు జరిగిన అవమానాలను మండి పట్టించుకోలేదు‘‘అని రనౌత్ అన్నారు.2014, 2019లో అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. మూడు ఎన్నికల ర్యాలీల తర్వాత అన్ని పార్లమెంటు స్థానాలను నిలుపుకుంది. అలాగే, ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ ‘చరిష్మా’నే గెలిపించింది. అయితే, కాంగ్రెస్ తన బలమైన ఓటు బ్యాంకుపై కన్నేసింది. 2.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఆ రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసింది. ఏదిఏమైనప్పటికీ, ఈ మండి నియోజకవర్గంలో కంగనా రనౌత్ భారీ ఆధిక్యం సాధించడంతో బీజేపీ గెలుపు ఖాయమేనని స్పష్టమవుతోంది.