- Advertisement -
టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్న కన్నా నాగరాజు
Kanna Nagaraju took permanent membership of TDP
—- పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తాను
—- గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు వెల్లడి
సత్తెనపల్లి,
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చూచనలతో గుంటూరు నగర మాజీ మేయర్, కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా నాగరాజు తెలుగుదేశంపార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా కన్నా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా తాను కూడా తెలుగుదేశం పార్టీకి లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నాను అని తెలిపారు. పార్టీ అభివృద్ధికి తనవంతుగా విశేషంగా కృషి చేస్తానని కన్నా నాగరాజు తెలిపారు.
- Advertisement -