- Advertisement -
హత్య కేసులో కన్నడ హీరో అరెస్ట్
Jun 11, 2024,
హత్య కేసులో కన్నడ హీరో అరెస్ట్ కన్నడ సినీ హీరో దర్శన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలో ఆయన పవిత్ర గౌడను పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. వారి ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ క్రమంలో పవిత్ర గౌడకు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. జూన్ 8న రేణుకా స్వామి హత్యకు గురయ్యాడు. హీరో దర్శన్ సూచనతోనే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -