Monday, March 24, 2025

ఆనాటి రణక్షేత్రంలో పల్నాటి మహావీరుడు కన్నమదాసు

- Advertisement -

ఆనాటి రణక్షేత్రంలో పల్నాటి మహావీరుడు కన్నమదాసు

Kannamadasu, the great hero of the past, was in the battlefield of that day

 కన్నమదాసు వాడిన ఆయుధం భైరవ ఖడ్గం
పల్నాడు
మనం అందరం బాహుబలి సినిమా చూసివుంటాం, దానిలో కట్టప్ప అని మహా సైన్యాని ఉంటాడు. మహా బలవంతుడు, రాజు మరియు రాజ్యం పట్ల అతివిశ్వాసపాత్రుడిగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 100 మంది కట్టప్పల ధీరత్వం, విశ్వాసం కలిగిన గొప్ప మహావీరుడు కన్నమదాసు. నడిచే అగ్నికణం, విశ్వసానికి మారుపేరు, భయం అంతే తెలియని ధీరోత్తముడు కన్నమదాసు. 11వ శతబ్దంలో మాచర్ల సైన్యానికి సర్వసైన్యధిపతిగా భాధ్యతలు నిర్వహించి బ్రాహ్మణయుడికి నమ్మిన బంటుగా కడవరకు నిలిచి చరిత్రలో పల్నాటి ప్రజల గుండెల్లో నేటికీ నిలిచిన మహావీరుడు కన్నమదాసు. కన్నమదాసు తండ్రి తెప్పల. నాయన్న ( తెప్పలనీయుడు) తల్లి పేమ్మసాని.కన్నమ్మ, కన్నమదాసు తెప్పలనీయుడు పల్నాటి రాజ్యస్థాపకుడైన అణుగురాజు ఆస్థానంలో సైన్యధ్యక్షుడు. ఈయన బ్రహ్మనాయుడు తండ్రి దొడ్డనాయుడుతో పల్నాడుకు వలస వచ్చాడు. కన్నమనియుడు నేత్రుత్వంలో జరిగిన కోరుట్ల కధనంలో విజయం సొంతమైంది. ఈ యుద్ధం అనంతరం అరణగండ్ల యుద్దానికి దారి తీసి పల్నాటి రాజ్యస్థాపనకు దోహదం చేసింది. చిన్నపటి నుండే కన్నమదాసుకు పట్టుదల, విరత్వం, భయపడని గుణం తల్లితండ్రులు నేర్పారని పల్నాడు చరిత్రలో మనకు మొదటిగా తెలిసిన శ్రీనాధ కవి సర్వబౌమ తన పల్నాటి వీరచరిత్ర గ్రంధంలో కన్నమదాసు అరివీర భయంకుడు అని మహావీరుడు అని తెలిపారు. ఆ రోజుల్లో కన్నమదాసును కన్నమనీయుడు రాజమల కన్నమదాసు అని ప్రజలు పిలిచేవారని చరిత్ర చెపుతుంది. 1170 వ సంవత్సర ప్రాంతంలో కారంపూడిలో జరిగిన పల్నాటి యుద్ధం పల్నాటి వీరుల విరత్వం గురించి వారి తధానంతరం మహాదేవిచర్ల (మాచర్ల), గురజాల, కారంపూడి ప్రజలు బుర్రకధ రూపంలో కన్నమదాసు వీరత్వం గురించి. వీరచరిత్ర గ్రంధం రచించారు. కన్నమదాసు కదనరంగంలోకి వస్తే శత్రుసైన్యం లక్షమంది ఉన్న చమటలు పట్టేవాట. యుద్ధ రంగన ఆయన గుర్రం పరిగేత్తే గిట్టల శబ్దం కూడా శత్రువులను భయకంపితులను చేసేది. దేవుడా ఆ మహావీరుడు మా వైపు కాకా మరోవైపు వెళ్లేలా చూడు అని కోరుకునే వారట. అయన కత్తితో చేసే వీరవిహారం చుస్తే శత్రురాజులు ఆయనకు ఎదురుగా కాకుండా తప్పించుకునేవారట. పల్నాటి యుద్ధంలో గొప్ప వీరుడు బాలచంద్రుడు లాంటి మహావీరులు మరణించినను కన్నమదాసు పల్నాడు సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఒడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చిన మహావీరుడు కన్నమదాసు అని చరిత్ర చెపుతుంది. కన్నమదాసు రాజజ్ఞను పాటించడంలో గొప్ప విధేయుడని, అత్యంత సమయస్ఫూర్తి గల వాడని, అనేక క్లిష్ట సమయలలో చతురతతో వ్యవహరించి మాచర్ల పాలకులను కాపాడరని పల్నాటి వీరచరిత్ర పుస్తకంలో కన్నమదాసును వర్ణించారు. కన్నమదాసు వాడిన ఆయుధాలు ఇతర ఏ వీరులు వాడలేదని ఆయన చేతిలో భయంకర ఖడ్గం ఉండేదాని, దాని బరువు అధికమని, ఆయనను దెగ్గర నుండి చూస్తేనే శత్రువులకు పై ప్రాణాలు పైనే పోయేవని చరిత్రకారులు చెప్తుంటారు. పల్నాటి బ్రహ్మనాయుడు కి అనుక్షణం చేదోడు వాదోడుగా ఉంటూ శత్రువుల నుండి ముప్పును కూడా అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడేవాడని కన్నమదాసు పక్కన ఉండగా బ్రహ్మనాయుడు ని ఎవరు ఏమి చేయాలేరాని నానుడి అప్పట్లో ఉండేదాని చరిత్ర కధనం. కన్నమదాసు అంటటి గొప్ప వీరుడు పల్నాడు ప్రాంతంలో పుట్టడం ఒక చరిత్ర అయితే ప్రజలు ఆయనను ఇప్పటికి గుర్తుంచుకోవడం గొప్ప విషయమని కన్నమదాసు వీరత్వం గ్రీకు వీరుని  వీరత్వానికి తీసిపోనిదని ఎంతోమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. తెలుగునాట విరాత్వానికి ప్రతీక కన్నమదాసు. కన్నమదాసు వాడిన ఖడ్గన్ని భైరవ ఖడ్గం అంటారు. అది ఇప్పటికి కారంపూడి నాగులేరు వడ్డున వీర్లగుడిలో ఉంది. ఈ విధంగా పల్నాటి యుద్ధం ఒక ప్రముఖ తెలుగు దళిత యోధుడికి ఉదాహరణగా నిలుస్తుంది. అతని ఎదుగుదల నేటికీ సామజికంగా అట్టడుగున ఉన్న తెలుగు వర్గాలకు వేడుకగా మరియు స్మరించుకునే అంశంగా మిగిలింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్