తాడేపల్లి
పెనుమాకలో కాపు జాగృతి కమిటీ ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేయించిన కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్
మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాక గ్రామ కమిటీ
ప్రమాణ స్వీకారం కాపు జెఏసి నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుమాక నూతన కాపు జాగృతి కమిటీ సభ్యుల చేత
చందు జనార్ధన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జనాభా దామాషా ప్రకారం 25 శాతానికి పైగా ఉన్న కాపులకు చట్టసభలలో అవకాశం కల్పించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కోరడం జరిగిందని తెలిపారు. రాజకీయాలకతీతంగా పల్లె పల్లెలో కాపులు అందరూ సమైక్యంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలలని గ్రామ కమిటీలు ఎంతగానో దోహదపడతాయని
అన్నారు. కాపు వర్గం రాజాధికారం అందుకోవాలి అందుకు చేదోడువాదోడుగా కాపు జాగృతి కృషి చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉంటుంది.గ్రామస్థాయిలో మన వర్గాలతో పాటు కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయితో తోడ్పాటు అందించడంలో కాపు జాగృతిగా గ్రామ కమిటీలు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎల్లప్పుడూ ముందు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో పది సంవత్సరాల క్రితం తొలగించిన రంగా విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా ఎంపిక
చేశామన్నారు. త్వరలో కాంస్య విగ్రహం నెలకొల్పుతామని అన్నారు. అది కాపు జాగృతి ఉండవల్లి కమిటీ విజయమని అన్నారు.పెనుమాక గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వారు
అధ్యక్షులు కోటిపల్లి తిరుమల రావు,సెక్రెటరీ పోలిశెట్టి నరసింహరావు,కోశాధికారి ముప్పెర ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి చెక్కా నాని,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్..
పోలిశెట్టి వాసు ముప్పెర శేషు,చెక్కా సతీష్,ఈమని సురేష్,తోటకూర ప్రభాకర,ముప్పెర కృష్ణ,ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు అల్లుడు సాంబశివరావు, కొండిశెట్టి రాజేంద్ర,రాష్ట్ర చిరంజీవి యువత కోశాధికారి అమిరిశెట్టి వెంకటేశ్వరరావు,ఉండవల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పోలు ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి దాసరి దుర్గా మల్లేశ్వరరావు, గాజుల సురేష్, గ్రామ కాపు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



