Tuesday, March 10, 2026

తెలంగాణలో స్థిరపడిన కాపులు, తూర్పు కాపులు,తెలగ,బలిజలు మున్నూరుకాపులే:ఎంపీ రవిచంద్ర

- Advertisement -

Kapus, Eastern Kapus, Telaga and Balijas settled in Telangana are Munnuru Kapus: MP Ravichandra

వారికి తెలంగాణలో మున్నూరుకాపు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పిస్త:ఎంపీ రవిచంద్ర

పాల్వంచలో భవన నిర్మాణానికి చేయూతనిస్త:ఎంపీ రవిచంద్ర

పాల్వంచలోని ఎడవల్లి కృష్ణ నివాసంలో రెండు గంటల పాటు జరిగిన సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరు

వనమా ఘన విజయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మున్నూరుకాపులు
ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రల నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కాపులు, తూర్పు కాపులు,తెలగ,బలిజలందరూ మున్నూరుకాపులేనని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సుస్పష్టం చేశారు.తెలంగాణలో స్థిరపడిన వారందరికి అవసరమైనప్పుడు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించే బాధ్యత మున్నూరుకాపు సంఘం గౌరవాధ్యక్షుడిగా తనదేనని చప్పట్ల మధ్య ఆయన హామీనిచ్చారు.బీఆర్ఎస్ ప్రముఖులు ఎడవల్లి కృష్ణ నేతృత్వంలో ఆయన నివాసంలో మంగళవారం రాత్రి రెండు గంటల పాటు జరిగిన సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ,పాల్వంచలో సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు ఆర్థిక చేయూతనిస్తానని భరోసానిచ్చారు.మన మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలను పక్కనబెట్టి మరింత ఐకమత్యంతో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కోరగా, సమావేశానికి హాజరైన వారంతా సానుకూలంగా స్పందించారు.వనమా ఘన విజయానికి తాము శక్తివంచన లేకుండా పాటుపడుతామని మున్నూరుకాపు ప్రముఖులు వాగ్ధానం చేశారు.సమావేశానికి బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలు సర్థార్ పుట్టం పురుషోత్తం రావు, బత్తినీడి ఆది విష్ణుమూర్తి, పార్టీ నాయకులు ఎడవల్లి కృష్ణ, భీమా శ్రీధర్, మున్నూరుకాపు ప్రముఖులు ఎచ్చర్ల రమణమూర్తి నాయుడు (డిష్ నాయుడు), గంట్యాడ స్వామినాయుడు(బోసు బాబు),దామిరెడ్డి ప్రతాప్,అనిల్ కుమార్,జి.నరేష్,సిహెచ్ సత్యనారాయణ,బొమ్మిశెట్టి పుల్లారావు,చెన్నంశెట్టి రంగారావు,బాపట్ల మురళి, సేనాపతి శివ,కోటి,సత్తిపండు,కోలా వెంకటేశ్వరరావు,ఎర్రపాటి కృష్ణ,తోట రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్