Friday, January 10, 2025

మురళీమోహన్ చేతుల మీదుగా “కరణం గారి వీధి” సినిమా  పోస్టర్ విడుదల

- Advertisement -

మురళీమోహన్ చేతుల మీదుగా “కరణం గారి వీధి” సినిమా  పోస్టర్ విడుదల

"Karanam Gari Vedhi" movie poster released by Murali Mohan

కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ  నటిస్తున్న సినిమా “కరణం గారి వీధి”. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్ పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు.  దర్శకద్వయం హేమంత్, ప్రశాంత్ ఈ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. త్వరలోనే గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో కరణం గారి వీధి సినిమా  పోస్టర్ ను ప్రముఖ నటులు మురళీమోహన్ చేతుల మీదుగా నేడు రిలీజ్ చేశారు.
ఈ  సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ – కరణం గారి వీధి సినిమా పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నాను. కరణం గారి వీధి సినిమా సక్సెస్ అయి మొత్తం టీమ్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను”అన్నారు.

నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ – మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన మురళీమోహన్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తాం. అన్నారు.

దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ – పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ – లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్లెజెంట్ గా ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది మురళీమోహన్ గారు తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ – కరణం గారి వీధి లో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది, మధ్యతరగతి కుటుంబం కష్టాలు వినోదాసపథంగా డైరెక్టర్స్ చాలాబాగా చిత్రీకరించారు, అన్నారు.

హీరోయిన్ వైశాలి మాట్లాడుతూ – కరణం గారి వీధి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. కరణం గారి వీధి చిత్రంతో మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు దక్కుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటీనటులు – కిట్టు తాటికొండ, కష్మిరా, రోహిత్,వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపిచంద్ కొండ, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్