Friday, October 18, 2024

ధర్మం కోసం బీజేపీనే పోరాడుతుంది :బండి సంజయ్

- Advertisement -

ధర్మం కోసం బీజేపీనే పోరాడుతుంది
కరీంనగర్, నవంబర్ 6,వాయిస్ టుడే
ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీ అని ఎంపీ,

కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్

వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని చెప్పారు. తన నామినేషన్ సందర్భంగా కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణవ్యాప్తంగా రెపరెపలాడించానన్నారు. బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే తనపై మతతత్వ వాది అని ముద్ర వేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాజాసింగ్, నేను ధర్మం కోసమే పోరాడుతామని, ఎన్నికలు ఉన్నా, లేకున్నా తాము కాషాయ జెండాను వదిలి పెట్టమని స్పష్టం చేశారు.
బీజేపీతోనే అభివృద్ధి
హైదరాబాద్, నవంబర్ 6, (వాయిస్ టుడే )
సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో సోమవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే ‘బీసీ బంధు’ దక్కిందని, కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. సీఎం భూ దందాలకు పాల్పడుతున్నారని, అసైన్డ్, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని, రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శిస్తున్నాని, అవి రెండూ ఒక్కటైతే తాను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను గద్దె దించడం ఒక్క బీజేపీకే సాధ్యమని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలని ఈటల అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్