22.1 C
New York
Friday, May 31, 2024

రాముడి చుట్టూ కరీంనగర్ రాజకీయం

- Advertisement -

రాముడి చుట్టూ కరీంనగర్ రాజకీయం
కరీంనగర్, మే 3  ( వాయిస్ టుడే )
కరీంనగర్‌లోనూ రాముడే అన్ని పార్టీలకు ప్రచారాస్త్రంగా మారారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకలను బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న సంస్థాగత బలం ఆసరా చేసుకుని బాలరాముడి ప్రతిష్టాపన సందర్భంగా జరిగిన ప్రతీ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుకెళ్లడంతో సఫలీకృతం అయ్యారు. అక్షింతల ఊరేంగింపు, ప్రతీ ఇంటికి పంపిణీ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో జరిగేలా చూశారు.కరీంనగర్ రాజకీయంగా అత్యంత కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి. విభిన్నమైన తీర్పుతో రాష్ట్ర దృష్టిని ఆకర్షించేలా చేస్తారని కరీంనగర్ ఓటర్లకు పేరు ఉంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అక్కడి రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రతిష్టాపన తర్వాత బీజేపీ నేతలు రామనామాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఇంటింటికి అక్షింతల పంపిణీతో మెజారిటీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు కమలనాథులు. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జైశ్రీరాం అంశాన్నే ప్రముఖంగా తమ ప్రచారంలో వాడుకుంటున్నారు బీజేపీ నేతలు.కొన్ని దశాబ్దాలుగా జైశ్రీరాం నినాదం భారతీయ జనతా పార్టీ పేటెంటా..? అన్నట్టుగా ప్రచారం చేశారు కమలం నేతలు. ప్రతీ సందర్భంలోనూ రాముని ప్రస్తావనే చేస్తూ ఓన్ చేసుకున్నారు. రాముని పేరు వాడుకోవడం వల్ల బీజేపీకి వస్తున్న మైలేజీతో ఆలోచనలో పడ్డ ప్రత్యర్ధులు, తొలుత ఎదురుదాడికి దిగారు. అభివృద్దిని వదిలేసి, మోదీ పదేళ్ల పాలనలో ఏం చేయలేదనే, రాముడి పేరుతో ఎన్నికలకు వెళ్లారని విమర్శలకు దిగుతున్నారు విపక్షాల అభ్యర్థులు. ఇదేం వర్క్‌ ఔట్ కావడం లేదని ఫీల్డ్ పొజిషన్ చూసి విమర్శలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయని రూట్ మార్చారు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు. తాము కూడా జైశ్రీరాం అని నినదించడం స్టార్ట్ చేయడంతో ఎన్నికల రాజకీయంలో రాముడు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారినట్టయింది.ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం పట్ల ఆక్షేపణ ప్రారంభించారు. అక్షింతలు కావు రేషన్ బియ్యం అని ఏకంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించినట్టు బీజేపీ జనంలోకి తీసుకెల్లింది. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ వారికి అక్షింతల పట్ల గౌరవం లేదని కౌంటర్ అటాక్ చేసింది బీజేపీ. ఇలా విమర్శలు ప్రతి విమర్శలు.. చివరికి మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి తెచ్చింది. తాము రామునికి, అక్షింతలకు వ్యతిరేకం కాదని ప్రకటించాల్సి వచ్చింది. అక్షింతల పట్ల తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే ఆత్మాహుతికి కూడా సిద్దమని సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆతర్వాత వచ్చిన శ్రీరామనవమి వేడుకల్లోనూ బీజేపీతో పోటీ పడి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాముడు మాకూ దేవుడే.. మేమూ భక్తులమే.. మేమూ అయోధ్యకు వెళ్తామని పొన్నం పదే పదే చెప్పాల్సి వచ్చింది..!కాంగ్రెస్‌ నేతలను అటాక్ చేయడంతోనే ఆగకుండా, పనిలో పనిగా బీఆర్ఎస్ నేతలను కూడా మెల్లగా ట్రాప్‌ చేసింది బీజేపీ. కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు నాస్తికులు, అందుకే రామ మందిర ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొనలేదని ప్రచారంలో విరుచుకుపడటం స్టార్ట్ చేశారు. నాస్తికులయిన వారికి మెజారిటీ ప్రజల మనోభావాలు పట్టవని తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రారంభించారు బండి సంజయ్. దీంతో డైలామాలో పడ్డ గులాబీ పార్టీ నేతలు సైతం తాము రాముడికి వ్యతిరేకం కాదని, రాముడు పేరుతో జరుగుతున్న రాజకీయాలకే వ్యతిరేకం అని ఢిపెన్స్ చేసుకోవడం ప్రారంభించారు. దేవుడూ, భక్తి అని చెప్పుకునే బండి సంజయ్ కరీంనగర్‌లోని వేములవాడ రాజన్న గుడికి, కొండగట్టు అంజన్న దేవాలయానికి ధర్మపురి నర్సింహస్వామికి, ఇల్లందకుంట రాములోరి గుడి అభివృద్దికి ఏంచేశారని ఎదురు దాడికి దిగారు బీఆర్‌ఎస్ నేతలు.ఇటీవల కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ అయితే రాముడు బీజేపీ ఎమ్మెల్యేనా..? ఎంపీనా..? రాముడు అందరికి దేవుడూ తామూ జై శ్రీరాం అంటామని ప్రకటించారు. అందరం జై శ్రీరాం అంటాం, బీజేపీని ఓడిస్తాం.. అని గట్టిగానే కౌంటర్ ఎటాక్‌కు దిగారు. రాముడికి ఓటు ఉంటే బండి సంజయ్‌ని ఓడిస్తాడని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ ఇంటింటికి వెళ్లండి.. జై శ్రీరాం అనండి కారు గుర్తుకు ఓటేయాలని అడగండని అంటూ గులాబీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీ రామారావు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బండి సంజయ్ కుమార్ వేములవాడ రాజన్నకు, కొండగట్టు అంజన్నకు ఇస్తానన్న నిధులు ఏవీ అంటూ కేసీఆర్‌ హామీలను పేర్కొంటూ గులాబీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా.. అక్షింతలు కలపాలి, పులిహోర వండాలి జైశ్రీరాం అనాలి.. ఇవే కడుపు నింపుతాయా అన్న కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, వారిది మోసపూరిత భక్తి అంటూ ఘాటుగానే విమర్శించారు.ఓవరాల్‌గా చూస్తే కరీంనగర్‌ పాలిటిక్స్‌ అంతా రామునిచుట్టూ తిరిగేలా చేసింది. అన్ని పార్టీలు జైశ్రీరాం అనాల్సిన అనివార్యతను సృష్టించడంలో బీజేపీ సక్సెస్‌ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి రాముడు.. జై శ్రీరాం నినాదంతోనే అంచెలంచెలుగా ఎదిగింది బీజేపీ కానీ, ఇప్పుడు ఆ రామనామం అందరు నేతల నోటి నుంచి అనివార్యంగా పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది..కరీంనగర్‌లో జైశ్రీరామ్ నినాదానికి తామే కారణమంటున్నారు బీజేపీ నేతలు. టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల నోట నుంచి జైశ్రీరామ్ వచ్చిందంటే బిజెపి వల్లే అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇలా కరీంనగర్ రాజకీయాల మాత్రం జైశ్రీరామ్ నినాదం చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నిసార్లు రామజపం చేస్తున్న ఈ మూడు పార్టీల్లో  ఓటరు దేవుడు ఎవరికి జై కొడతాడో వేచి చూడాలి

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!