వృద్ధురాలి అనుమానాస్పద మృతి మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన కశింకోట పోలీసులు
– బంధువురాలే హంతకురాలు
కశింకోట
Kasimkota Police Solve Mystery of Elderly Woman’s Suspicious Death Within 24 Hours
కశింకోట గ్రామంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలు దమ్ము నాగమ్మ (85) హత్య కేసు మిస్టరీని కశింకోట పోలీసులు అత్యంత సమర్థవంతంగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. అప్పుల బాధతో బంగారు నగ ల కోసం సొంత బంధువురాలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితురాలిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలు సిమ్మ సత్య మృతురాలికి బంధువే. సిమ్మ సత్య అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మృతురాలి వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసింది. ఈ నెల 16-05-2026 రాత్రి మృతురాలి ఇంటికి వెళ్లి, మొదట ఆ నగలను తాకట్టు పెట్టుకోవడానికి ఇవ్వమని అడిగింది. నాగమ్మ నిరాకరించడంతో, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని, మంచంపై టీవీ చూస్తున్న నాగమ్మ మెడకు తను ధరించిన చున్నీతో గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. హత్య అనంతరం ఉదయం నాగమ్మ చెవులకున్న బంగారు దిద్దులను దొంగిలించి, కొప్పాక గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద రూ.50,000/-లకు తాకట్టు పెట్టింది. హత్యకు ఉపయోగించిన చున్నీని కశింకోట కాలువలో పారేసింది. సాంకేతిక ఆధారాలు, నమ్మకమైన సమాచారంతో అనుమానితురాలైన సిమ్మ సత్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది.



