- Advertisement -
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం
తిరుపతి
ఒంటిమిట్ట
శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో
శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు
- Advertisement -