- Advertisement -
అసెంబ్లీ స్పీకర్ కు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
Kaushik Reddy should apologize to the Speaker of the Assembly
హైదరాబాద్
తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కి క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పై కాగితాలు చింపి విసరడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భూభారతి బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్ పై భూభారతి కి సంబంధించిన పేపర్లు చించి వేసి విసరడం సరికాదన్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అగ్ర వర్ణ దురఅహంకార ధోరణికి వదిలిపెట్టాలని అన్నారు. తక్షణమే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
- Advertisement -