Tuesday, March 18, 2025

కవిత పింక్ బుక్ అంటూ కామెంట్స్…

- Advertisement -

పింక్ బుక్ కామెంట్…
మెదక్, ఫిబ్రవరి 14, (వాయిస్ టుడే)

Kavita's comments are pink book

పరీక్షల్లో కాపీ కొట్టడం మనం చూసే ఉంటాం. కానీ పాలిటిక్స్ లో కూడ కాపీయింగ్ మొదలైంది. టీడీపీ అంటే అస్సలు పడని ఓ పార్టీ, ఇప్పుడు టీడీపీ దారిలోనే నడుస్తుందట. ఏపీలో రెడ్ బుక్ అంటుంటే, తెలంగాణలో పింక్ బుక్ ఓపెన్ చేశామని ప్రకటించారు బీఆర్ఎస్ కు చెందిన మహిళా నేత కవిత. తాజాగా కవిత చేసిన కామెంట్స్ కి టీడీపీని బీఆర్ఎస్ కాపీ కొట్టిందంటూ నెటిజన్స్ రెస్పాండ్ అవుతున్నారు.ఏపీలో మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఆ పాదయాత్రలో కార్యకర్తలు తమ ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తమను అకారణంగా వైసీపీ నాయకులు, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అప్పుడు పుట్టిందే రెడ్ బుక్.. తమ కార్యకర్తలను చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు, తప్పక రెడ్ బుక్ లో ఉంటాయని లోకేష్ చెప్పారు. ఎన్నికలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. రెడ్ బుక్ ఓపెన్ అయినట్లేనని చెప్పవచ్చు. ఎందుకంటే పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడం, తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడ అరెస్ట్ చేయగా రెడ్ బుక్ ఓపెన్ అంటూ ప్రచారం సాగుతోంది.అయితే లోకేష్ ఓపెన్ చేసిన రెడ్ బుక్ ను చూసి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడ కాపీ కొట్టేసిందని చెప్పవచ్చు. ఏపీలో అక్రమ కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా పింక్ బుక్ ఓపెన్ కానుందని ప్రచారం సాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అధికారం వచ్చాక అందరి సంగతి తేలుస్తాం. పింక్ బుక్ ఓపెన్ చేశామంటూ ప్రకటించారు. టీడీపీ ఓటమి ఖాయమంటూ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతల నోట వినిపించిన మాట వాస్తవమే. అటువంటి పరిస్థితుల్లో టీడీపీ రెడ్ బుక్ ను కాపీ కొట్టి పింక్ బుక్ అంటూ కవిత కామెంట్స్ చేశారని నెటిజన్స్ అంటున్నారుతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు అభివృద్ది, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను సాగిస్తోంది. ఇటీవల దావోస్ పర్యటన వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి, లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చారు. ఇలా కాంగ్రెస్ పాలన సాగుతుండగా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఓ రేంజ్ లో విమర్శల పర్వాన్ని సాగిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. సాక్షాత్తు మంత్రి సీతక్కను ఉద్దేశించి బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ట్రోలింగ్ కి తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడ అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పలుమార్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా హద్దులు దాటి ప్రవర్తించగా, చట్టం తనపని తాను చేసుకుపోయింది.లైన్ దాటి మరీ ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా టీంను కంట్రోల్ చేయకుండా, కవిత పింక్ బుక్ అంటూ కామెంట్స్ చేయడం ఏమిటని కాంగ్రెస్ అంటోంది. అక్రమ కేసులు ఎక్కడా బనాయించిన దాఖలాలు లేవని, టీడీపీ రెడ్ బుక్ ను చూసి కవిత కాపీ కొట్టారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా తమ పార్టీ అంటే అస్సలు పడని బీఆర్ఎస్.. తమను కాపీ కొట్టిందని టీడీపీ సోషల్ మీడియా అంటోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్