Tuesday, December 24, 2024

బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ…

- Advertisement -

బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ…
హైదరాబాద్, సెప్టెంబర్ 28,

Kavitha re-entry from Bathukamma…

బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత… ఇప్పటివరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కవిత… బెయిల్‌ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా సైలెంట్‌గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజమాబాద్‌లోనూ ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఐతే, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తనపై రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట కవిత. అందుకే తన రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం తన బ్రాండ్ బతుకమ్మను వేదికగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ సంబరాలతో తనకో బ్రాండ్‌ సంపాదించుకున్నారు కవిత. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలకు ప్రాచుర్యం తీసుకువచ్చారు. ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కవిత… ఇప్పుడు బతుకమ్మ పండగ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతంలో కంటే దూకుడుగా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు… తనపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నారని సమాచారం. సరైన వేదిక కోసం చూస్తున్న కవిత… బతుకమ్మ పండుగను సద్వినియెగం చేసుకోవాలనుకుంటున్నారని అంటున్నారు.ఇప్పటికే కవిత పార్టీ సీనియర్స్, మేధావులతో సమావేశమై, రాజకీయ వ్యుహాలపై సమాలోచనలు చేస్తున్నారట. మెజారిటీ నేతలు బతుకమ్మతోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సూచన చేసినట్లు చెబుతున్నారు. ఇక కవితను కలుస్తున్న కార్యకర్తలు సైతం బతుకమ్మతోనే ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు అధికారం కోల్పోయిన నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఓటమి భారంతో అధినేత ఫామ్‌ హౌస్‌లోనే ఎక్కువగా గడుపుతుండగా, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పార్టీ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు. వీరికి కవిత కూడా తోడైతే రాజకీయంగా బలం పుంజుకోవచ్చని భావిస్తున్నారు.ఇక ప్రజల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది… ఆమె రోల్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. కుమార్తె రీ ఎంట్రీ విషయంలో అధినేత కేసీఆర్‌ ఆలోచనలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఢిల్లీ స్థాయిలో బాధ్యతలివ్వాలా? రాష్ట్ర స్థాయిలోనా? అనేది ఇంకా తెలియరాలేదు. ఏదిఏమైనా కవిత రీ ఎంట్రీతో బీఆర్‌ఎస్‌లో జోష్‌ తీసుకురావాలనే ప్లానింగ్‌ జరుగుతోందంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్