కవిత ‘బిఆర్ఎస్ అనబోయి.. బిజెపి’ అన్నట్లున్నారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్ ఫిబ్రవరి 19
Kavitha seems to have said ‘BRS is not a boi.. BJP’: BJP state president Ramachandra Rao
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మేలో కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కొత్త పార్టీ పెడితే తెలంగాణలో బిజెపి ఉండదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కవిత కొత్త పార్టీ పెడితే.. భూస్థాపితమయ్యేది బిఆర్ఎస్‌యేనని.. బిజెపి కాదని ఆయన పేర్కొన్నారు. బిజెపి కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో రామచందర్ రావు పాల్గొన్నారు. శివాజీ చిత్రపటానికి ఆయనతో పాటు ఎంపి అరవింద్, పలువురు నాయకుడు నివాళులు అర్పించారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ.. కవిత ‘బిఆర్ఎస్ అనబోయి.. బిజెపి’ అన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ భూస్థాపితం కాకుండా కవిత చూసుకోవాలని హితవు పలికారు.



