రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సర్కారే
మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరైయారు. . 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ మంత్రి అందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ రోజు సంగారెడ్డిలో పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. చిన్న గ్రామపంచాయతీలో కూడా సర్పంచ్ తో పాటు పంచాయతీ సెక్రెటరీ నియమించి పదివేల మంది పంచాయతి సెక్రటరీలకు ఉపాధి కల్పించాం. తెలంగాణ 3 శాతం ఉన్న జనాభా కు 38% అవార్డులు దేశంలో వస్తున్నాయంటే దాని వెనుక మీ కృషి ఉందని అన్నారు.
ఈరోజు అన్ని గ్రామాలకు ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీ ఉన్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఇన్ని వసతులు లేవు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి అంటు రోగాలు నిర్మూలించగలిగాం.
సంగారెడ్డిలో 300 మొదటి దశ బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది దశలవారీగా కొనసాగుతుంది బీసీ బంధు నిరంతర ప్రక్రియ. బీసీ వర్గాలనే కాదు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మన ముఖ్యమంత్రి.
5300 కోట్ల రూపాయలు రైతు బీమా కింద రైతు కుటుంబానికి సహాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి ది. పక్కన ఉన్న కర్ణాటకలో 24 గంటలు కరెంటు ఉందా. రాజస్థాన్, చత్తీస్గఢ్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారా. ఈ దేశంలో 24 గంటల కరెంటు రైతుల ఇస్తుంది అంటే అది కేవలం ఒకే ఒక నాయకుడు మన కేసీఆర్.
రైతు రుణమాఫీ రద్దు చేయరేమో అనుకొని దింపుడు గల ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు రైతు రుణమాఫీ చేసి బుద్ధి చెప్పారు కెసిఆర్. సోమవారం రోజు పెద్ద ఎత్తున రైతుల అకౌంట్లో డబ్బులు వేసి సోమవారం సాయంత్రం వరకు 99 వేల రూపాయల వరకు రైతులు రుణ మాఫీ చేస్తాము. కెసిఆర్ రైతులకు అడిగింది ఇచ్చిండు అడగంది ఇచ్చిండు. రైతుబంధు రైతు బీమా ఇచ్చిండు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేసిండు. కాలేశ్వరం కట్టి పుష్కలంగా నీళ్లు తెచ్చిండు 24 గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్. ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే నని అయన అన్నారు.