- Advertisement -
కె.సి.ఆర్ దీక్షా దివాస్ వల్లే తెలంగాణ రాష్ట్రానికి ష్ట్రన్నికి నిజమైన విజయ దివాస్.
KCR Deeksha Diwas is a real victory Diwas for Telangana state.కె.సి.ఆర్ సుదీర్ఘ పోరాటం వల్లే డిసెంబర్9 తెలంగాణ ప్రకటన
మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి
వనపర్తి
కె.సి.ఆర్ సుదీర్ఘ పోరాటం 11రోజుల ఆమరణ దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9న వెలువడిందని ఎవరి దయాధాక్షిణ్యాల వల్లగాని రాలేదని కె.సి.ఆర్ పోరాట అర్హత,దక్షత వల్లనే రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజు కాబట్టి ఈరోజు విజయ దివాస్ జరుపుకుంటున్నామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ధీక్షా దివాస్ రోజు సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గోపాల్ పేట మండల కేంద్రంలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ మరియు అమరవీరులు పోలీస్ కిష్టయ్య,యాదయ్య,సువర్ణ తదితరులకు నివాళులు అర్పించారు.
కె.సి.ఆర్ 14 ఏండ్ల సుదీర్ఘ పొర్రటంతో రాష్ట్రాన్ని సాధించి అధికారం చేపట్టి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చేపట్టి అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టా రని అన్నారు.
రెండు తరాల పోరాటం తర్వాత మూడవ తరం కె.సి.ఆర్ నాయకత్వములో సాధించుకున్న తెలంగాణ చేజారి నేటికీ సంవత్సరం అయ్యిందని నేటి పాలకులు 100రోజుల్లో చేస్తామన్న హామీలు సంవత్సరం అయినా నెరవెరక ప్రజలు నానా గోసపడుతున్నారని అన్నారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చుకొనుటకు మరో ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఏర్పడిందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి కె.సి.ఆర్ కి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
- Advertisement -




