హైదరాబాద్: భారాస తరఫున చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరు ఖరారైనట్లు సమాచారం. చేవేళ్లతో పాటు నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల (భువనగిరి, నల్గొండ) ఎన్నికల కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంగా అభ్యర్థి విషయమై సమావేశంలో చర్చించారు. కొన్ని వ్యక్తిగత, ఇతర కారణాల రీత్యా రంజిత్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఆయన ఎక్కడికీ వెళ్లారని పార్టీలోనే కొనసాగుతారని కేసీఆర్ నేతలకు వివరించినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే మెజార్టీ ఉందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి నేతలు మొగ్గు చూపినట్లు సమాచారం.
లోక్‌సభ టికెట్ ఆశించి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల సమావేశానికి హాజరు కాలేదు. ఆశావహ అభ్యర్థులకు సంబంధించి కేసీఆర్ ఆరా తీశారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని విషయాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెప్పినట్లు నేతలు పేర్కొన్నారు.
చేవెళ్ల , నల్గొండ ,భువనగిరి లో అభ్యర్థుల ఎంపిక పై కెసిఆర్ కసరత్తు
- Advertisement -
- Advertisement -