పేదలను మోసం చేసిన కేసీఆర్ సర్కారు
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి
గుంటి జంగయ్యనగర్ లో జరిగిన సభలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

ధ్వజం
వనస్థలిపురం, వాయిస్ టుడే:
తాము అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించారని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కిగౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్య కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగుండ్ల ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు మధుయాష్కిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీ స్థాపకులు దివంగత గుంటి జంగయ్య విగ్రహానికి మధుయాష్కి గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను అధికార పార్టీ నేతలు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ చెప్పి ఆ వాగ్దానాలను విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని తామే చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీనిచ్చారు. వృద్ధులకు రూ.4వేల పించన్లు, ఉపాధి లేని మహిళలకు రూ.2500, ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకుముందు టీడీపీ నేతలు సుజాత రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు కుట్ల నర్సింహయాదవ్, నాయకులు మకుటం సదాశివుడు, గోపాల్ ముదిరాజ్, అనసూయ, సుజాత, వసుధ, కావేరి, డి.శ్రీనివాస్, బత్తుల మల్లేష్ గౌడ్, శ్రీకాంత్, సాయి భరత్, నారాయణ, వెంకటయ్య, అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు