ఆర్టీసీని విలీనం ఎన్నికల స్టంట్
హైదరాబాద్, ఆగస్టు 2, (వాయిస్ టుడే) కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి మండలి నిర్ణయించినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయడం ఎన్నికల స్టంటే అని ఆయన కుండబద్దలు కొట్టారు. పీర్జదిగుడా, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లలో వివిధ కార్యక్రమలకు మంత్రి మల్లారెడ్డి హాజరు అయ్యాడు. పీర్జదిగుడా పార్టీ కార్యాలయం దగ్గర కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్, కార్పొరేటర్లు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం ఎన్నికల స్టంట్ హ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అవును ఎన్నికల కోసమే అనుకో ఏమైనా అనుకొర్రీ కార్మికులు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారని సమాధానం ఇచ్చారు.
మాది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా వుంటాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కావాలన్నారు. అవన్నీ తమ పార్టీ అధినేత కేసీఆర్కు మాత్రమే ఉన్నాయి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.అయితే, గత నెల 31వ తేదిన సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం అయింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న డిసిషన్ పై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ చిత్రపాటానికి పాలభిషేకం చేస్తున్నారు.