కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం
బాంబ్ పేల్చిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, మే 3
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ బాంబ్ పేల్చారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని కేటీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ చెప్తే.. ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ అంబేద్కర్‌ను అవమానించిందని విమర్శించారు. కులాల పేరు మీద రిజర్వేషన్లు వద్దనేది రాజీవ్ గాంధీ వాదనన్నారు. రేవంత్ రెడ్డి ది కాంగ్రెస్ బ్లడ్ కాదని.. రేవంత్ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్‌లను హైకోర్టు కొట్టివేస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం బాంబ్ పేల్చిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- Advertisement -
- Advertisement -