మెదక్, నవంబర్ 23, (వాయిస్ టుడే): తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బక్కోడు కాదని.. భూ బకాసురుడు అని అన్నారు. ఆయన ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడు అని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.‘‘ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్ సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైంది. కేంద్రం నిధులు తెచ్చి రఘునందన్ రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానన్నారు. మూడేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకోని రఘునందన్ కు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదు. ఈ ప్రాంతానికి 10వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేది. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప… ఈ ప్రాంత అభివృద్ధికోసం చేసిందేమీ లేదు.కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాతచింతకాయ పచ్చడే. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదు? ఎందుకు దుబ్బాకకు నిధులు తెప్పించలేదు? ఎందుకు ఈ దుబ్బాకకు పీజీ కాలేజీ తీసుకురాలేదు? ఎందుకు ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు. పదేళ్లుగా ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదు.. కేసీఆర్ గడీలో పెద్ద జీతగాడిలా.. బంట్రోతులా పనిచేశాడు తప్ప. దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. రఘునందన్ ను, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు. ఇక వాళ్లను చూడాల్సిందేం లేదు. నీతికి, నిజాయితీకి మారుపేరు చెరుకు ముత్యంరెడ్డి. అలాంటి ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారింది. తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు. కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడు.ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
కేసీఆర్ బక్కోడే కాదు.. భూ బకాసురుడు
Published By Voice Today Team
179
- Advertisement -
- Advertisement -
- Tags
- congress revanth reddy
- dubbaka
- dubbaka by election
- dubbaka revanth reddy
- mp revanth reddy
- revanth reddy
- revanth reddy at dubbaka
- revanth reddy campaign at dubbaka
- revanth reddy congress
- revanth reddy dubbaka
- revanth reddy dubbaka live
- revanth reddy dubbaka speech
- revanth reddy in dubbaka
- revanth reddy live
- revanth reddy on kcr
- revanth reddy speech
- revanth reddy speech in dubbaka
- revanth reddy vs harish rao
- revanth reddy vs kcr



