- Advertisement -
ప్రజల్లోకి కేసీఆర్, కవిత
KCR, Kavitha to the public
హైదరాబాద్, ఆగస్టు 31 (న్యూస్ పల్స్)
బీఆర్ఎస్ పార్టీ కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత కవిత అరెస్టు.. పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం.. సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి ఊహించని దెబ్బ. కోలుకోవాలంటే..ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓ వైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు రాలేకపోయారు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత రిలీజయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా మారింది. బెయిల్ పై విడుదలైన తర్వాత కవిత ఢిల్లీలోనే తనను అక్రమంగా జైలుకు పంపారని.. వడ్తో సహా చెల్లిస్తానని బీజేపీకి హెచ్చరికలు పంపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై కేసులు పడటం.. అరెస్టు చేయడం వెనుక కాంగ్రెస్ కు ఎలాంటి పాత్ర లేదు కాబట్టి.. అంతా బీజేపీనే చేస్తోందని.. గతంలో ఆరోపించి ఉన్నారు కాబట్టి కవిత చేసిన సవాల్ బీజేపీకే అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె కానీ.. ఇతర బీఆర్ఎస్ పెద్దలు కానీ బీజేపీ పేరు మాత్రం పలకలేదు. కవిత చేసిన సవాల్ కూడా వివాదాస్పదమయింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీనే నిందిస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం పెద్దగా బీజేపీపై విమర్శలు చేయడం లేదు. తన బిడ్డను బీజేపీ జైల్లో పెట్టిందని కేసీఆర్‌కు పీకల దాకా కోపం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలు ఖరారు చేసుకుంటారని అందుకే బీజేపీపై ఇరప్పుడు ఎలాంటి కామెంట్లు చేయడం లేదని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తే .. ప్రజల్లో అనేక చర్చలు జరుగుతాయి. బిడ్డను జైల్లో పెట్టిన పార్టీని కాకుండా కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తే ఎలా అన్న ప్రశ్న వస్తుంది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి లేదన్న వాదన ఉంది. ఇంకా ఏడాది కూడా అవ్వని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందన్న వాదన కూడా ఉంది. కారణం ఏదైనా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి చూస్తే. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును మెల్లగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. తమ పార్టీ ఓట్లను బీఆర్ఎస్సే బీజేపీకి మళ్లించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదే నిజమైనా.. బీఆర్ఎస్ కు ముప్పే. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తనే.. తమ పార్టీ క్యాడర్ లో ఉన్న సందేహాలను పటా పంచలు చేసినట్లవుతుంది. గతంలో బీజేపీపై పలుమార్లు యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు అలాంటి యుద్ధం ప్రకటించాల్సి ఉంది. లేకపోతే ఇప్పటి వరకూ జరిగిన విలీనాలు, పొత్తుల అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో బీఆర్ఎస్ ప్లేస్ ను క్రమంగా బీజేపీ ఆక్రమించుకంటూనే ఉంటుంది. ఒక వేళ కేసీఆర్ రంగంలోకి దిగి.. కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తే.. అది బీజేపీకే ప్లస్ అవుతుంద్న అబిప్రాయం ఉంది. రాజకీయ చాణక్యుడిగా కేసీఆర్ వ్యూహాలు ఏ దిశగా అమలు చేస్తారోనని బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
- Advertisement -