నేడు జడ్చర్ల,  మేడ్చల్ లో కెసిఆర్ సభ

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ 18: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు.

వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వా ద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేటలో జరి గిన బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొనగా,

నేడు బుధవారం జడ్చర్ల, మేడ్చల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. కొంత విరామం ఇచ్చి దసరా పండుగ తర్వాత ఈ నెల 26 నుంచి మళ్లీ సిఎం కెసిఆర్ ప్రచారం కొనసాగనుంది.

KCR meeting in Medchal today
KCR meeting in Medchal today

అక్టోబర్ 26 అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులతో తిరిగి ప్రారంభం కాను న్న తొలిదశ ప్రచార పర్వం నవంబర్ 9వ తేదీన కామారెడ్డి సభ ముగుస్తుంది. సిఎం కెసిఆర్ ఒక్కో రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటి స్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.

తొలి విడతలో 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీల టికెట్లు… అభ్యర్థులు ఎవరు..? అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

అయితే ఆయా పార్టీల నుంచి బరి లో దిగనున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాలవారీగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular