- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: ప్రతిఒక్క కార్యకర్త సైనికుడి వలె పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, మూడోసారి కెసిఆర్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్ పేట్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందన్నారు. కెసిఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -