Thursday, December 12, 2024

కేసీఆర్ రుణం తీర్చుకోవాలి : కవిత

- Advertisement -

ప్రతి మహిళకు నెలకు 3000…

దాసరి ని భారీ మెజార్టీతో గెలిపించాలి…

కాంగ్రెసోల్ల మాయమాటలు నమ్మొద్దు…

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత

పెద్దపల్లి:  సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నిజామాబాద్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  అన్నారు. ఆదివారం రాత్రి పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జెండా కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో  మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ ను  మూడోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహరన్న ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 200 రూపాయలు ఉన్న పింఛన్లు మొదట వెయ్యి రూపాయలకు 2018లో రెండు వేలకు పెంచుకున్నామన్నారు మూడోసారి అధికారంలోకి రాగానే 5000 లకు పెంచుకుంటామన్నారు. మనోహరన్నని గెలిపించగానే ప్రతీ మహిళకు నెలకు 3000 రూపాయలు అందిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి కావడం వల్లే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు నమ్మవద్దని మొండి చేయికి ఓటు వేస్తే తిరిగి కష్టాలు ప్రారంభమవుతాయన్నారు.

KCR should clear his debt: Kavitha
KCR should clear his debt: Kavitha

పెద్దపల్లిలో మనోహరన్న గెలుపు ఖాయమైందని సర్వేలన్నీ బారాసా వైపే ఉన్నాయన్నారు. గతంలో సాగునీరు తాగునీరుకి కష్టాలు ఉండేవని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి కష్టాలు తొలగిపోయాయన్నారు. తనకు మిలాన్ కలాకంద్ అంటే ఎంతో ఇష్టమని ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పకుండా తెప్పించుకొని తింటానన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలు కారు గుర్తుకు ఓటు వేసి మనోహర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ , సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, రైతు సమితి జిల్లా డైరెక్టర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ, పాక్స్ ఛైర్మెన్ లు,పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కో ఆప్షన్ లు, యువత అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మైనారిటీ యువకులు ,తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్