Thursday, December 26, 2024

కేసీఆర్ నిజం చెప్పండి….  ఎన్డీఏలో చేరాలని అనుకోలేదా

- Advertisement -

హైదరాబాద్, అఅక్టోబరు :  బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. విశ్వాసానికి మారుపేరు మోడీ.. విశ్వాస ఘాతకానికి మారుపేరు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.. ఈనాటికి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదు.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా నరేంద్ర మోడీ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు అని ఆయన తెలిపారు. 2005లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ లాలూ ప్రసాద్ 350 కోట్ల రూపాయలు పెట్టారు.. 2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలేదు అని ఈటెల రాజేందర్ ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ కాలంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ పూర్తి చేశారు అని ఈటెల రాజేందర్ అన్నారు. బాధ్యత కలిగిన మంత్రి హరీశ్ రావు, ప్రధాని ప్లెక్సీని చించేశారు.. టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారు.. గృహలక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇచ్చే టైం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కండువా కప్పుకుంటే.. బీసీ బంధు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.. కేసీఆర్ మాటలకు మోస పోతే గోస పడుతారు.. ప్రధానిని టూరిస్ట్.. చీటర్ అని అంటున్నారు.. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టారు అని ఈటెల రాజేందర్ చెప్పారు.10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదు.. చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్.. కరప్షన్ ఫ్రీ స్టేట్ అంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీకి 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది.. హుజురాబాద్ లో 6‌00 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు? అని ఆయన అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ సమాచారం లేకుండా మాట్లాడతారా?, దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించారో తెలియదా?, ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను.. తనకు మద్దతు ఇవ్వాలని కొన్ని రాజకీయ పక్షాలను కోరిన మాట వాస్తవం కాదా? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

దళితుడికి ఎస్సీ వెల్ఫెర్, బీసీకి బీసీ వెల్ఫెర్ మంత్రి పదవులు ఇచ్చి సరిపెడతారని ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇరవైళ్లుగా కేసీఆర్ చేతిలోనే ఉంది.. భవిష్యత్ లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు.. ముఖం బాగాలేక అద్దం పగలకొట్టుకున్నట్లు ఉంది కేసీఆర్ తీరు.. గురువింద గింజ నలుపు ఎరుగనట్లు ఉంది కేసీఆర్ తీరు.. గిరిగీసి బరిలో కొట్లడటానికి బీజేపీ సిద్ధంగా ఉంది అని ఆయన మండిపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్ర మోడీ కేసీఆర్ ను దూరం పెట్టారు.. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లాలో చెప్పాలి.. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు అని ఈటెల రాజేందర్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్