రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి  కేసీఆర్..?

- Advertisement -

రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి  కేసీఆర్..?

KCR to enter the field for farmers from next month..?

హైదరాబాద్
బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ దిగనున్నారు.ఈ బీఆర్ఎస్ పోరాటంపై శనివారం సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు.కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సా హం పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular