నేను వస్తున్నా మీరు రండి:
అసెంబ్లీ కి కేసీఆర్
KCR to the Assembly
హైదరాబాద్
డ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది బిఆర్ ఎస్. కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదేపదే రెచ్చగొడుతూ వస్తున్నారు. అయినా సరే కేసీఆర్ సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు.
ఆరోగ్య కారణాలతో ఆయన సమావేశాలకు రావడం లేదని కొంతమంది, ఇక రేవంత్ ను సీఎం హోదాలో చూడటం ఇష్టం లేక రావటం లేదని మరి కొంతమంది అంటున్నారు. అయితే కేసీఆర్ రాకపోతే గులాబీ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, కేటీఆర్, హరీష్ రావు వంటి వాళ్ళు ఎంత మాట్లాడిన మీడియాలో హడావుడి జరగదని, కాబట్టి కెసిఆర్ సభకు హాజరై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని గులాబీ పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.
అయితే కేసీఆర్ మాత్రం ఇన్నాళ్లు మౌనంగానే ఉండిపోయారు. కనీసం మీడియా సమావేశాలు కూడా కేసీఆర్ నుంచి పెద్దగా రాలేదు. ఇక ఇప్పుడిప్పుడే ఆయన మీడియాలో కనబడుతున్నారు. ఆరోగ్యంగా కాస్త కెసిఆర్ కోలుకోవడంతో అటు గులాబీ పార్టీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. కేసీఆర్ మీడియాలో మాట్లాడితే కచ్చితంగా హడావుడి వేరే స్థాయిలో ఉంటుంది.
అవసరమైతే జాతీయ మీడియాను కూడా తన వైపుకు తిప్పుకునే సత్తా కేసీఆర్ లో ఉంది. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నట్టుగానే కనబడుతుంది. ఇక తమ పార్టీ మాజీ మంత్రులకు కూడా ఇప్పటికే కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి సభకు రావాలని, ఎమ్మెల్యేలు కాని వారు మీడియా సమావేశాలు పెట్టి నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రసంగాలు చేయాలని కేసిఆర్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.