అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు
కేటీఆర్
హైదరాబాద్
KCR will attend the assembly sessions
KTR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు హజరవుతరాని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ స్థాయి వేరు. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు. వాళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఆయన ఆలోచన. మోడీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడు.. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం ముందు పడి కృషి చేసింది మేము, కానీ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. శ్రవణ్ ను 2023 లో నామినేట్ చేశాం.. అప్పుడు బీజేపీ ఆపింది. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో నడవటం లేదు.. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆయనది నడవటం లేదు… ఎక్కే విమానం దిగె విమానం తప్ప చేసేది ఏమీ లేదు రేవంత్ రెడ్డి. ఈ కార్ రేసు కేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారు.. 16 బడ్జెట్ పెట్టీ,17 నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారు. ప్రతి బడ్జెట్లో ఇది ఉండేదే…ఇది ముమ్మాటికీ లొట్టపీసు కేసని అన్నారు. ఈ కార్ రేస్ కేసు వల్ల ఏం లాభం జరిగిందో నేను చెప్తా. 200 కోట్లు పెట్టీ ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారు. దీనివల్ల లాభం ఏంటి.. ఈ మొగోడు ఒలింపిక్స్ పెడుతానంటున్నాడు దానికి లక్ష కోట్లు కావాలని అన్నారు.