కేసీఆర్ భావోద్వేగం…
అప్పడు అస్థిత్వం… ఇప్పుడు విచారణలా.
హైదరాబాద్, ఫిబ్రవరి 2, (వాయిస్ టుడే )
KCR’s emotion…
Then it was existence…now it’s like an investigation.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. గత పదేళ్లు రాష్ట్రాన్ని శాసించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసంలో సిట్ అధికారుల విచారణను
ఎదుర్కొన్నారు. కేవలం విచారణే కాదు, అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు, కేసీఆర్ వ్యక్తం చేసిన భావోద్వేగాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.విచారణ ప్రారంభానికి ముందు కేసీఆర్ తీవ్ర
భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన సమయంలో తన సన్నిహితుల వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. నందినగర్‌లోని కేసీఆర్ నివాసం తెలంగాణ ఉద్యమ
కాలంలో కీలక నిర్ణయాలకు వేదిక. “స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. వ్యూహాలు రచించాను. అలాంటి పవిత్రమైన చోట నేడు నేరారోపణలపై విచారణ ఎదుర్కోవాల్సి రావడం
బాధాకరం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “తెలంగాణ అస్థిత్వం కోసం పోరాడిన గదిలో.. ఇప్పుడు అదే రాష్ట్రంలో విచారణ ఎదుర్కోవడం కాలం చేసిన వింత క్రీడ.” అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ
పడుతున్నారు.ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ విచారణలో సిట్ అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. సాధారణంగా విచారణ సమయంలో న్యాయవాదులను
అనుమతించాలని కోరుతుంటారు, కానీ సిట్ అధికారులు ఇందుకు నిరాకరించారు. నిబంధనల ప్రకారం కేవలం కేసీఆర్‌ను మాత్రమే ప్రశ్నించారు. విచారణ మొదలవ్వగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర కీలక
నేతలను అధికారులు బయటకు పంపేశారు. లోపల కేసీఆర్, సిట్ బృందం మాత్రమే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అధికారుల వాంగ్మూలాలు, రికార్డైన ఆధారాల ప్రాతిపదికన కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం
కురిపించినట్లు తెలుస్తోంది.కేసీఆర్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. నందినగర్ నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు.
తమ నాయకుడిని విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడక్కడా నిరసనలకు దిగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా
కనిపిస్తోంది. కేసీఆర్ భావోద్వంతో కేడర్ లో సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోందని సమర్థించుకుంటోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్
దుమారం ఏ స్థాయిలో రచ్చకు కారణమయ్యాయో తెలుసు. కానీ ఉద్యమనేత కేసీఆర్ నే విచారించడాన్ని మాత్రం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ సాధించిన నేతగా, దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన
వ్యక్తి ఇలాంటి విచారణ ఎదుర్కోవాల్సి రావడం విశేషమే.!



