- Advertisement -
అంబేద్కర్ కు కేసీఆర్ నివాళులు
KCR's tribute to Ambedkar
హైదరాబాద్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.
దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని. ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కేసీఆర్ కొనియాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3, ఈ దిశగా వారి దార్శనికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని అన్నారు.
వారి విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో వారి స్ఫురద్రూపాన్ని తెలంగాణాలో అత్యంత ఎత్తయిన విగ్రహం గా నిలుపుకున్నామన్నారు. దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన బీఆర్ అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్’ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.
- Advertisement -



