తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి శోభ

- Advertisement -

తిరుపతి :అక్టోబర్ 10:  తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ MLA, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు.

kcrs-wife-shobha-visited-tirumala-srivara
kcrs-wife-shobha-visited-tirumala-srivara

కెసిఆర్ కుటుంబ సభ్యులు  హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు..ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని సీఎం సతీమణి శోభ శ్రీవారిని  కోరుకున్నట్టు తెలిసింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular