మహాత్మ జ్యోతి బాపులే గురుకులాన్ని టాప్ లో ఉంచండి:
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Keep the Mahatma Jyothi Bapule Gurukulam at the Top:District Collector Chitra Mishra
కరీంనగర్
తిమ్మాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ.
విద్యార్థులతో మాట్లాడి
వసతుల కల్పన పై ఆరా
అధికారులకు దిశా నిర్దేశం.
అత్యుత్తమ విద్యా బోధనకు కేరాఫ్ అడ్రస్ గా మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాన్ని తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. అత్యుత్తమ విద్యను బోధించాలని మంచి ఫలితాలు సాధించి గురుకులాన్ని టాప్ లో నిలబెట్టాలని పేర్కొన్నారు.
తిమ్మాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. మెనూ ప్రకారం టిఫిన్ లంచ్ పెడుతున్నారా..విద్యాబోధన ఎలా ఉంది వసతులు సౌకర్యాలు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అన్ని బాగున్నాయని విద్యార్థులకు సమాధానం ఇచ్చారు. అనంతరం స్టాఫ్ రూము, వాష్రూమ్స్ వంటగది స్టోర్ రూమ్ డార్మెటరీ గదులను పరిశీలించారు. స్టోర్ రూమ్ లో బియ్యము పప్పులు ఇతర సామాగ్రిని పర్యవేక్షించారు. సామాగ్రికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ ను తరచు చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యుత్తమ విద్యను బోధించాలని మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా గురుకులంలో చేపట్టిన మోడ్రన్ కిచెన్ ఆధునికరణ పరులను పరిశీలించారు. గురుకులంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని వసతుల కల్పన.. మెనూ ప్రకారం భోజనం కల్పించే విషయంలో
అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ జరపాలని సూచించారు. గురుకులంలో ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. శానిటేషన్ సమస్త తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గురుకులంలో కోతుల బెడద ఉందని వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్ ను కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ కోతుల బెడద నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గురుకులం అభివృద్ధి.. విద్యా బోధన..ఇతర అంశాలపై అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక గురుకుల ప్రిన్సిపాల్ సరిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



