పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
కరీంనగర్
Keeping the environment clean is everyone’s responsibility
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో స్వచ్చదనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం లో గల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామాలలో, పట్టణాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈనెల 5వ తేది నుండి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునే విధంగా రోజు వారి కార్యచరణ ప్రకారం అధికారులు అన్ని మండలాలలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో ప్రతి ఇంట్లో కనీసం 6 మొక్కలు నాటాలని ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని క్లోరోస్కోప్ ద్వారా త్రాగునీటి పరీక్షలు చేసి నాణ్యమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం కేవలం 5 రోజుల పాటు కాకుండా నిరంతరం కొనసాగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమిష్టిగా బాధ్యతతో పని చేసినప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
మనం వాడుతున్న వాటర్ ట్యాంక్ లు శుభ్రం చేస్తున్నప్పుడు అందరూ గ్రామ ప్రజలు గమనించాలి అని చెప్పారు.వర్షాకాలం లో శుభ్రమైన నీటిని వాడాలని కోరారు ఆ నీరు టెస్ట్ చేసి వాడాలని అని కోరారు.ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటిని నిలువ చేయడం వల్లనే ఈ రోజు మనం నీటి కరువు రాకుండా చేయగలిగాం అని చెప్పారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని ప్రతి దానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకుండా స్టీల్ బాటిల్ వాడకాన్ని పెంచాలి అని సూచించారు .తడి చెత్త పొడి చెత్త బాకెట్స్ ను సరిగా వాడి చెత్తను వేరు చేసి పర్యావరణాన్ని కపడచ్చు అని చెప్పారు.కుక్కల దాడి నుండి పిల్లలను కాపాడుకునేందుకు పిల్లల తల్లి తండ్రులు పిల్లలకి అవగాహన కల్పించుకోవాలని చెప్పారు. ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలి అని కోరారు.ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమం లో కొత్తపల్లి మండల తహసీల్దార్ రాజేష్ , మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ సిబ్బంది గ్రామ మహిళలు పాల్గొన్నారు