ఫాంహౌస్‌లో కీలక భేటీ
Key meeting at the farmhouse
కేసీఆర్ కమింగ్ సూన్*….. అంటూ గురువారం *ఎంపీ వద్దిరాజు రవిచంద్ర* .. ఓ వీడియో విడుదల చేశారు
*భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ కసరత్తు*
*పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమీక్ష*
హైదరాబాద్ 👉ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ప్రతికూల ఫలితాలు వచ్చినందున.. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమీక్షించనున్నట్లు సమాచారం. 👉ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని బరిలోకి దింపాలనే అంశాన్ని చర్చించడంతోపాటు పార్టీ నుంచి ఎవరిని ప్రతిపాదించనున్నారో ప్రకటించే అవకాశం ఉంది. పార్టీమారిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహంపైనా కేసీఆర్ స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ తరఫున భారీ బహిరంగ సభను ఎక్కడ.. ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫాంహౌ్‌సను వీడి తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో కేసీఆర్ క్రియాశీలం కానునున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ గురువారం ఓ వీడియో విడుదల చేశారు