బాలిక కిడ్నాప్… నలుగురు వ్యక్తుల లైంగిక దాడి

- Advertisement -
Kidnapping of girl...Sexual assault by four men
Kidnapping of girl…Sexual assault by four men

లక్నోనవంబర్ 17: నలుగురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికను నలుగురు వ్యక్తులు ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కాగా, బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవాలని ఒక వ్యక్తి తన కుమార్తెను బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular