- Advertisement -
డబ్బులిస్తామని కిడ్నీ మాయం
AP: విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ
రాకెట్ ముఠా మోసాలు వెలుగుచూశాయి. ఆర్థిక
కష్టాల్లో ఉన్న మధుబాబుకు భాషా అనే వ్యక్తి
పరిచయమయ్యాడు. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు
ఇప్పిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆపరేషన్ చేసి
కిడ్నీ తీసుకున్నారు. అయితే, కేవలం రూ.1.10 లక్షలు
మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బు గురించి అడిగితే
బెదిరింపులకు దిగారని గుంటూరులోని ఎస్పీ
కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
- Advertisement -




